: మెరుగుపడ్డ పుజారా ర్యాంక్
చటేశ్వర్ పుజారా ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో తన స్థానాన్ని మెరుగుపరచుకున్నాడు. ఈ రోజు ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకులలో పుజారా రెండు స్థానాలు దాటుకుని బ్యాట్స్ మెన్ జాబితాలో ఐదో స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ మాత్రం 11వ స్థానానికి పడిపోయాడు. 851 పాయింట్లతో ఈ జాబితాలో మొదటి ఐదు స్థానాలలో చోటు సంపాదించిన ఏకైక ఆటగాడు పుజారానే. ఆస్ట్రేలియా బ్యాట్స్ మ్యాన్ డీవీలర్స్ 912 పాయింట్లతో అగ్ర స్థానంలో ఉన్నాడు. బౌలర్ల జాబితాలో రవిచంద్రన్ అశ్విన్ ఏడో స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్లలో టాప్ అశ్వినే.