: మోడీ ఎన్నికల ప్రచారానికి గిన్నిస్ రికార్డ్


2012 గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రసంగాలను దంచి కొట్టిన ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గిన్నిస్ రికార్డు సృష్టించారు. ఈ విషయాన్ని మోడీ స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 3డీ  ఇల్ల్యూషన్ టెక్నాలజీ సాయంతో 2012, డిసెంబర్ 10న మోడీ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. యాబై ఐదు నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగం ఏక కాలంలో 53 ప్రదేశాలలో ప్రత్యేక తెరల ద్వారా ప్రసారం అయింది.

ఏకకాలంలో పలు చోట్ల ప్రసంగించిన ఈ ప్రత్యేకతను గిన్నిస్ వరల్డ్ రికార్స్డ్ గుర్తించిందని మోడీ తెలిపారు. మోడీ ప్రచారానికి ఉపయోగించిన 3డీ హోలోగ్రాఫిక్ ప్రొజెక్షన్ టెక్నాలజీ యూరోప్ లో చాలా ప్రాచుర్యంలో ఉంది. మన దగ్గర దీనిని వాడిన తొలి నేత మోడీ కావడం విశేషం. 

  • Loading...

More Telugu News