: సెహ్వాగ్ ను వెనకేసుకొచ్చిన గంభీర్
పేలవమైన ఆటతీరుతో భారత క్రికెట్ జట్టుకు దూరమైన సెహ్వాగ్ ను.. మరో క్రికెటర్ గంభీర్ వెనకేసుకొచ్చాడు. తాజా రంజీ ట్రోఫీలోనూ సెహ్వాగ్ సత్తా చాటలేకపోయాడు. దీనిపై వ్యక్తమవుతున్న విమర్శలను ఢిల్లీ రంజీ జట్టు కెప్టెన్ గౌతం గంభీర్ తిప్పికొట్టాడు. 'సెహ్వాగ్ ఒక్కడే కాదు.. ఢిల్లీ రంజీ జట్టులో అందరూ కలిసే ఆడాం. వీరూకి ఇది గ్రేట్ సీజన్ కాదు. కానీ, ఆటలో ఇది సాధారణమే. జట్టును ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, మిథున్ దీ, నాదీనూ. నాకౌట్ దశలో ఢిల్లీ జట్టు క్వాలిఫై కానందుకు సెహ్వాగ్ ఒక్కడినే తప్పుబట్టడం సరికాదు' అని గంభీర్ అన్నాడు. ఈ రంజీ సీజన్ లో సెహ్వాగ్ 234 పరుగులు చేయగా.. కనీస సగటు 13 ఇన్నింగ్స్ లలో 20 పరుగుల కంటే తక్కువగా ఉంది.