: శాసనసభ, మండలి రేపటికి వాయిదా
ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి. శాసనసభలో సీమాంధ్ర, తెలంగాణ నేతలు తీవ్ర ఆందోళన చేయడంతో శాసనసభను రేపటికి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. అంతకుముందు, బిల్లుపై సవరణలు ఈ నెల 10లోగా ఇవ్వాలని సభ్యులకు స్పీకర్ తెలిపారు. అటు శాసనమండలిలోనూ ఇదే పరిస్థితి కొనసాగింది. దీంతో శాసన సభ, శాసన మండలి సమావేశాలు రేపటికి వాయిదా పడ్డాయి.