: ఇవాళ శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్


సమాచార ఉపగ్రహం జీశాట్ -14ను కక్ష్యలో ప్రవేశపెట్టిన జీఎస్ ఎల్వీ-డీ5 ప్రయోగం విజయవంతం కావడంతో ఇస్రో ఛైర్మన్ రాధాకృష్ణన్ ఇవాళ ఉదయం తిరుమలేశుని దర్శనానికి వచ్చారు. విఐపీ దర్శన వేళల్లో ఆయన స్వామిని దర్శించి ప్రత్యేక సేవలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ శ్రీహరికోటలో జరిగిన రాకెట్ ప్రయోగం విజయవంతమైనందున శ్రీవారి దర్శనానికి వచ్చానని చెప్పారు. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ ప్రయోగంలో భాగంగా 16 నిమిషాల 50 సెకన్లలో రాకెట్ నిర్దేశిత కక్ష్యలోకి చేరుకున్న విషయం విదితమే.

  • Loading...

More Telugu News