: సీఎం కిరణ్ కాంగ్రెస్ లోనే ఉంటారు: వాయలార్ రవి
సొంత పార్టీ పెట్టి త్వరలో కాంగ్రెస్ నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బయటకు వెళ్లిపోతారంటూ వస్తున్న వార్తలను కేంద్రమంత్రి వాయలార్ రవి తీవ్రంగా ఖండించారు. కిరణ్ కాంగ్రెస్ లోనే ఉంటారని ఆయన తేల్చి చెప్పారు. అయితే, ఆయన సొంత పార్టీ పెడుతున్నారనేది మీడియా ఊహాగానాలేనని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడితే కాంగ్రెస్ నష్టపోతుందనేది సీఎం కిరణ్ వ్యక్తిగత అభిప్రాయమని వాయలార్ వెల్లడించారు.