: ప్రైవేటు టెలికాం కంపెనీలను ఆడిట్ చేసేందుకు కాగ్ కు అనుమతి
ప్రైవేటు టెలికాం కంపెనీల ఖాతాలను కాగ్ (కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్) ఆడిట్ చేయవచ్చని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ట్రాయ్ చట్టం కింద కాగ్ కు ఈ అవకాశముందని ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. 'అసోసియేషన్ ఆఫ్ యూనిఫైడ్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్స్ (ఏయూఎస్ పిఐ), సెల్యులర్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(సీఓఏఐ)లు ఈ మేరకు వేసిన పిటిషన్లను ధర్మాసనం కొట్టివేసింది.