: జస్టిస్ ఏకే గంగూలీకి సుప్రీంలో చుక్కెదురు
మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఏకే గంగూలీకి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. పశ్చిమబెంగాల్ మానవహక్కుల సంఘం ఛైర్మన్ పదవి నుంచి తనను తొలగించకుండా కేంద్ర ప్రభుత్వాన్ని నిలువరించాలంటూ పెట్టుకున్న పిల్ ను కోర్టు కొట్టివేసింది. అంతేగాక గంగూలీపై చర్యలు తీసుకోవాలంటూ దాఖలైన మరో పిల్ ను కూడా కోర్టు తిరస్కరించింది. న్యాయ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న గంగూలీ రెండు రోజుల కిందట 'కోల్ కతా నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ జ్యుడీషియల్ సైన్సెస్'(ఎన్ యూజెఎస్) గౌరవ ప్రొఫెసర్ పదవికి ఆయన రాజీనామా చేశారు.