: పాక్ పౌరులకు సులభ వీసాల జారీ లేనట్లే


భారత్ ను సందర్శించే పాకిస్థాన్ పర్యాటక బృందాలకు సులభంగా వీసాలను జారీ చేయాలన్న ప్రక్రియకు బ్రేక్ పడింది. దీనిని శుక్రవారం నుంచి ప్రారంభించాలని  భారత్ నిర్ణయించింది. బుధవారం శ్రీనగర్లోని సీఆర్పీఎఫ్ బేస్ క్యాంపుపై ఉగ్రవాదుల ఆత్మాహుతి దాడుల నేపథ్యంలో సులభ వీసాల జారీ నిర్ణయాన్ని నిలిపివేస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. 

భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా పాక్ హోం మంత్రి రెహ్మాన్ మాలిక్, భారత హోం మంత్రి షిండేల మధ్య వీసా జారీ నిబంధనల సరళీకరణకు అంగీకారం కుదిరింది. దీంతో మార్చి 15 నుంచి ఇరు దేశాలు పర్యాటలకు వీసాల జారీని సులభతరం చేయాల్సి ఉంది. దీనిని శుక్రవారం నుంచీ అమలు చేయడం లేదని కేంద్ర హోం శాఖ ఈ రోజు సాయంత్రం ప్రకటన జారీ చేసింది. 

  • Loading...

More Telugu News