: శంకరరావు అరెస్టుపై సీఎం అసంతృప్తి
గ్రీన్ ఫీల్డ్ భూముల వ్యవహారంలో మంత్రి శంకరరావు అరెస్టుపై ముఖ్యమంత్రి కిరణ్ కు మంత్రి ప్రసాద్ కుమార్ ఫిర్యాదు చేశారు. అదుపులోకి తీసుకున్న సమయంలో శంకరరావు పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును సీఎంకు తాను వివరించాననీ, దీనికి స్పందించిన సీఎం.. అసంతృప్తి వ్యక్తం చేశారని మంత్రి విలేకరులకు చెప్పారు.
ఈ వ్యవహారంలో ఉన్నతాధికారులతో విచారణకు కూడా సీఎం హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. తనకు తెలియకుండా అరెస్టు జరిగిందనీ, జరిగిన ఘటనకు చింతిస్తున్నాననీ సీఎం తనకు చెప్పారని మంత్రి పేర్కొన్నారు. అంతేగాక అరెస్టుకు బాధ్యులైన వారిని సస్పెండ్ చేస్తామనీ కిరణ్ చెప్పినట్లు మంత్రి వెల్లడించారు.