: పెద్దల సభకు శరద్ పవార్?


ఎన్సీపీ నేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ రానున్న లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. నలభై ఏడేళ్ల నుంచి తాను ఎన్నికల్లో పోటీచేసి గెలుస్తున్నానని, ప్రస్తుతం వచ్చే ఎన్నికల్లో ప్రజలు కొత్తవారిని కోరుకుంటున్నారని అన్నారు. అందుకే ఇకనుంచి ఎన్సీపీ మహిళలను, యువతను ప్రోత్సహిస్తుందని పేర్కొన్నారు. దాంతో, పెద్దలసభ అయిన రాజ్యసభకు పవార్ పోటీచేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ముంబయిలో మాట్లాడిన పవార్.. ఈ నిర్ణయం వల్ల ఎక్కువశాతం పార్టీ పనిపై దృష్టి పెట్టే అవకాశముంటుందన్నారు.

  • Loading...

More Telugu News