: ఎమ్మెల్యేలకు స్పీకర్ అధ్యయన నివేదిక


ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల పునర్విభజన సమయంలో ఆయా రాష్ట్రాల శాసనసభల్లో అనుసరించిన ప్రక్రియపై తాను తెలుసుకున్న విశేషాలను నివేదిక రూపంలో స్పీకర్ మనోహర్ ఈ రోజు సభ్యులకు అందజేశారు. గత నెల చివరి వారంలో స్పీకర్ మనోహర్ పాట్నా, లక్నోలో పర్యటించి వచ్చిన విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ఆయా రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు, అధికారులతో మనోహర్ సమావేశమయ్యారు. గతంలో ఆయా రాష్ట్రాల పునర్విభజన బిల్లులపై సభలో అనుసరించిన విధానం, చర్చించిన తీరు, ఓటింగ్ మొదలైన అంశాలపై అధ్యయనం చేసి వచ్చారు. తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు-2013పై సభలో ఎలా ముందుకెళ్లాలనేది తెలుస్తుందన్నది స్పీకర్ అభిప్రాయం. తన అధ్యయన విశేషాలలో కూడిన నివేదికను సభ్యుల అవగాహన కోసం మనోహర్ అందించారు.

  • Loading...

More Telugu News