: సీఎం, లగడపాటి పార్టీ పెట్టాలని చూస్తున్నారు: దేవినేని ఉమ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఈ నెల చివర్లో పార్టీ పెట్టే అవకాశముందని వస్తున్న వార్తలకు టీడీపీ ఎమ్మెల్యే దేవినేని ఉమామహేశ్వరరావు మరింత బలం చేకూర్చారు. 23 తర్వాత సీఎం, ఎంపీ లగడపాటి రాజగోపాల్ కలిసి పార్టీ పెట్టాలని చూస్తున్నట్లు అభిప్రాయపడ్డారు. ఆ పార్టీ నుంచి నాలుగు సీట్లు సంపాదించి తిరిగి సోనియాకే ఇస్తారన్నారు. కాగా, ఏపీఎన్జీవో ఎన్నికల్లో ఉద్యోగులు వైఎస్సార్సీపీకు తగిన బుద్ది చెప్పారన్నారు. అసలు వాళ్ల ఎన్నికల్లో జగన్ అవసరమేంటన్న ఉమ వైఎస్సార్సీపీ అవసరాలకోసం అశోక్ బాబు జగన్ చెప్పినట్లు చేయాలా? అని ప్రశ్నించారు.