: కొత్త సంవత్సరం.. కొత్త విమానాలు


ఎయిర్ కోస్టా ఎయిర్ లైన్స్ కంపెనీ నుంచి నూతన సంవత్సరంలో రెండు కొత్త విమానాలు వచ్చాయి. ఒక్కో విమానంలో వంద సీట్ల సామర్ధ్యంతో ఇవి ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే ఈ ఎయిర్ కోస్టా విమానాలు హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరాయి. రాష్ట్రానికి చెందిన ఎయిర్ కోస్టా ఇప్పటికే రెండు విమానాలతో పలు ప్రాంతాలకు ఎయిర్ లైన్స్ సర్వీసులను నడుపుతోంది. ఇప్పుడు తాజాగా మరో రెండు కొత్త విమానాలు రావడంతో ఈ నెలాఖరు నుంచి విశాఖ, కోయంబత్తూరు, మధురైలకు కూడా ఎయిర్ కోస్టా సేవలు ప్రారంభించనుంది. దీంతో పాటు త్వరలో హైదరాబాదు నుంచి విజయవాడకు విమాన సర్వీసు అందుబాటులోకి రానుంది. ఈ నెలాఖరు నాటికి మొత్తం 40 సర్వీసులు ప్రారంభమవుతున్నాయి.

  • Loading...

More Telugu News