: షుగరు వ్యాధిని ఇలా అడ్డుకోవచ్చట
షుగరు వ్యాధిని అడ్డుకోవడానికి శాస్త్రవేత్తలు రకరకాల చికిత్సలను కనుగొంటున్నారు. ఈ వ్యాధిని సమర్ధవంతంగా ఎదుర్కొనడానికి శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు ప్రత్యేక పరిశోధనలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఒక జన్యువును పనిచేయకుండా చేస్తే షుగరువ్యాధిని ఎదుర్కొనవచ్చని పరిశోధకులు గుర్తించారు.
ఇల్లినాయిస్ విశ్వవిద్యాలయానికి చెందిన భారతీయ అమెరికన్ ప్రొఫెసర్ బెల్లూరు ఎస్.ప్రభాకర్ నేతృత్వంలోని పరిశోధకుల బృందం, టైప్ 2 మధుమేహం విషయంలో ఒక జన్యువు పనిచేయకపోవడం వల్ల కీలక లక్షణమైన హైపోగ్లైసీమియా తినకముందు పెరుగుతున్నట్టు గుర్తించారు. ఎలుకలపై చేపట్టిన ప్రయోగంలో ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఎంఏడీడీ అనే జన్యువుపై చేపట్టిన ఈ పరిశోధనల వల్ల మధుమేహ చికిత్సలో సరికొత్త చికిత్సా పద్ధతులను రూపొందించడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఈ జన్యువు సరిగా పనిచేయకపోతే రక్తప్రసరణ వ్యవస్థలోకి ఇన్సులిన్ సక్రమంగా విడుదల కాదని ప్రొఫెసర్ ప్రభాకర్ చెబుతున్నారు.