: ఆవు, గేదెపాలతోనేకాదు... ఇలా కూడా పెరుగు తయారుచేయవచ్చు
ఇప్పటి వరకూ చక్కటి రుచిరకమైన పాలకు, పెరుగుకు ప్రత్యామ్నాయం లేకుండా వుంది. ఇతర పదార్ధాలతో పెరుగు తయారుచేసినా అది అంత రుచిగా ఉండేది కాదు. దీనికి ప్రత్యామ్నాయంగా పరిశోధకులు కొన్ని రకాల గింజలు, ధాన్యాలనుండి తీసిన పాలతో కమ్మటి పెరుగును తయారుచేయడంలో విజయం సాధించారు.
ఆవుపాలు, గేదె పాలల్లో ప్రోటీన్లు, గ్లుటెన్ వంటి పదార్ధాలు కొందరి శరీర తత్వానికి సరిపడక వారు అలర్జీ బారిన పడుతుంటారు. ఇలాంటి వారికి మాత్రం శాస్త్రవేత్తలు తయారుచేసిన పాలు, పెరుగు చక్కటి ప్రత్యామ్నాయం కానుంది. కొన్ని రకాల గింజలు, ధాన్యాలనుండి సేకరించిన పాలతో శాస్త్రవేత్తలు కమ్మటి పెరుగును తయారుచేయడంలో విజయం సాధించారు.
వీరు బాదం, ఓట్స్ వంటి కొన్ని రకాల ధాన్యాలనుండి తీసిన పాలను ప్రొ బయోటిక్ బాక్టీరియా సాయంతో పెరుగుగా మార్చడం సులభమేనని తమ ప్రయోగాల ద్వారా నిరూపించారు. తాము తయారుచేసిన పెరుగు షుగరు వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందని పరిశోధకులు చెబుతున్నారు. గేదె, ఆవుపాలు సరిపడని వారికి తాము తయారుచేసిన పెరుగు చక్కటి పరిష్కారమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.