: నెటిజన్లూ... బహుపరాక్‌


చాలాసేపు ఇంటర్‌నెట్‌లో గడిపేవారు మనకు చాలామందే తారసపడుతుంటారు. వీరు రోజులో ఎక్కువభాగం నెట్టింట్లోనే గడుపుతుంటారు. ఫేస్‌బుక్‌లు, ఛాటింగులు, ట్విట్టరు... అంటూ రకరకాల వెబ్‌సైట్లలో కాలం గడుపుతుంటారు. ఇలాంటి వారికో హెచ్చరిక. మీరు నెట్టింట్లో ఉన్న సమయంలో మిమ్మల్ని ఒక కన్ను గమనిస్తూనే ఉంటుంది. మీ సందేశాల్లోను, సంభాషణల్లోను మీరు ఎలాంటి పదాలను వాడుతున్నారు... ఎలాంటి సందేశాలను ఇస్తున్నారు? అనే విషయాన్ని ఆ నిఘానేత్రం గమనిస్తూనే ఉంటుంది. కాబట్టి నెటిజన్లూ బహుపరాక్‌...!

దేశ భద్రత, నేరాల దృష్ట్యా ఎవరైనా దురుద్దేశ పూరితంగా ఉండే సందేశాలను ఇవ్వడాన్ని కనిపెట్టడానికి ఇంటర్నెట్‌ నిఘానేత్రం ప్రారంభించడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కూడా దానికి తుదిమెరుగులు దిద్దుతోంది. ఈ నిఘానేత్రం ద్వారా స్కైప్‌, గూగుల్‌ టాక్‌ వంటి వాటిలో జరిగే సంభాషణలను ప్రతిక్షణం పర్యవేక్షిస్తుంటుంది. ఈ నిఘానేత్రాన్ని డీఆర్‌డీవో ల్యాబ్‌లో సెంటర్‌ ఫర్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రోబోటిక్స్‌ (సీఏఐఆర్‌) అభివృద్ధి చేసింది. నిఘా విభాగం (ఐబీ), కేబినెట్‌ సెక్రటేరియట్‌ ఇప్పుడు చేస్తున్న పరీక్షల స్థానంలో దీన్ని ప్రవేశపెట్టడం ద్వారా భద్రతా సంస్థలకు మరింతగా బలం చేకూరనుంది. కాబట్టి మీ బ్లాగుల్లోను, ట్వీట్లలోను దాడి, బాంబు, పేలుడు వంటి పదాలను వాడేముందు కాస్త జాగ్రత్త వహించండి.

  • Loading...

More Telugu News