: నిరాశ అనే పదానికి నా జీవితంలో చోటు లేదు: నరేంద్ర మోడీ
ఢిల్లీలో జరిగిన బీజేపీ ప్రచార సభలో గుజరాత్ ముఖ్యమంత్రి, ఆ పార్టీ ప్రధాని అభ్యర్ధి మోడీ మాట్లాడుతూ 'నిరాశ అనే పదానికి నా జీవితంలో చోటులేదు' అన్నారు. ప్రజల మహోద్యమమే ఎన్నికలని, 2014 లో జరిగే ఎన్నికలు ప్రస్తుత ఎన్నికల సాంప్రదాయాలను మార్చి వేస్తాయని ఆయన తెలిపారు. దేశచరిత్రలో రాబోయే ఎన్నికలు తొలిసారిగా ఉద్యమరూపంలో జరగనున్నాయన్నారు. వట్టిమాటలు నమ్మవద్దని, నేతల ట్రాక్ రికార్డులు పరిశీలించాలని సూచించారు. టీ కప్పులు అమ్మిన నన్ను నాయకత్వం వహించమని దేశం కోరుకుంటోందని అంటూ, ఈ దేశానికి యువతే మహాశక్తి అని ఆయన పేర్కొన్నారు.