: అశోక్ బాబు విజయం ఏకపక్షమే?
ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఏకపక్షంగా విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఉదయం నిర్వహించిన ఎన్నికల అనంతరం జరుగుతున్న ఓట్ల లెక్కింపులో నాలుగు రౌండ్లు ముగిశాయి. నాలుగు రౌండ్లు ముగిసే సరికి అశోక్ బాబు ప్యానల్ కు 365 ఓట్లు పోలవ్వగా బషీర్ ప్యానెల్ కి 35 ఓట్లు మాత్రమే వచ్చాయి. దీంతో అశోక్ బాబు విజయం ఏకపక్షమేనని పలువురు అభిప్రాయపడుతున్నారు.