: యాత్రలకు అనుకూల సమయం తెలుసుకోవడం ఇక ఈజీ


యాత్రలకు వెళ్లడం కొంత మందికి అభిరుచి. ప్రపంచదేశాలను చుట్టిరావాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. కానీ ఎలా వెళ్లాలో... తీరా వెళ్లాక అక్కడ ఎలా ఉంటుందో అన్న సమాచారం తెలియక తీవ్ర ఇబ్బంది పడుతుంటారు చాలామంది. పోనీ ట్రావెల్ ఏజెంటుని అడుగుదామంటే అతను వ్యాపారం కోసం ఎక్కడ అబద్దం చెబుతాడో అనే అనుమానం పీడిస్తుంటుంది.

వీటిన్నింటికీ సమాధానంగా అమెరికాలోని మిషిగాన్ యూనివర్సిటీ ఖగోళ భౌతిక శాస్త్రవేత్త రాబర్ట్ నెమిరోఫ్ ఓ పరిష్కారం కనిపెట్టారు. తాము ఓ అప్లికేషన్ కనుక్కున్నామని దాని ప్రకారం వివిధ దేశాలకు సంబంధించిన వాతావరణాలకు సంబంధించిన సమాచారాన్ని అంతర్జాలంలో పూర్తిగా పొందవచ్చని, దాని ప్రకారం తమ యాత్రలను నిర్ణయించుకోవచ్చని తెలిపారు.

  • Loading...

More Telugu News