: రోడ్డు మీద దిగిన విమానం
విమానాలు రోడ్ల మీద దిగుతున్నాయి. అలా దిగుతుండడానికి బాధపడాలో.. లేక సరికొత్త సాంకేతిక విప్లవానికి బీజం వేస్తున్నారని ఆనందించాలో.. సాంకేతిక సమస్యలు పెరుగుతుండడాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక శాస్త్రవేత్తలు తలలు బద్దలు కొట్టుకుంటున్నారు. మొన్న యూపీలో విమానం జాతీయ రహదారిపై దిగి సంచలనం సృష్టిస్తే, తాజాగా అమెరికాలోని న్యూయార్క్ సిటీలోని అంతరాష్ట్ర రహదారిపై ఓ తేలికపాటి విమానం అత్యవసరంగా దిగింది. అయితే పైలెట్ సహా ప్రయాణికులిద్దరూ సురక్షితంగా ఉన్నారని, షాక్ కు మాత్రం గురయ్యారని వారిని వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించామని అధికారులు తెలిపారు. కాగా విమానం దిగడంతో రహదారిపై రాకపోకలకు 15 నిమిషాలు అంతరాయం కలిగింది.