: సూడాన్ ఘర్షణల నియంత్రణకు చర్చలు
దక్షిణ సూడాన్ లో ఘర్షణల నియంత్రణకు ఇథియోపియా రాజధాని అడ్డీస్ అబాబాలో ప్రత్యక్ష చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ చర్చల్లో ఘర్షణలకు నాయకత్వం వహిస్తున్న స్థానిక నేతలు పాల్గోనున్నారు. కాగా దక్షిణ సూడాన్ లో చోటు చేసుకున్న అంతఃకలహాల్లో వెయ్యిమంది వరకు చనిపోయారు. వారి ఘర్షణలు నియంత్రించాలనే ప్రధానోద్దేశ్యంతో ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అయితే ఇవి ఎంతవరకు సఫలమవుతాయనే దానిని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.