: విజయవంతమైన జీఎస్ఎల్ వీ-డీ5 ప్రయోగం


జీఎస్ఎల్ వీ -డీ5 అంతరిక్షంలోకి విజయవంతంగా ప్రయోగించబడిందని షార్ హర్షం వ్యక్తం చేసింది. జీఎస్ఎల్ వీ ప్రయోగం విజయవంతమవ్వడంతో శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలోని శ్రీహరికోటలోని అంతరిక్ష ప్రయోగకేంద్రం నుంచి ఆయన మాట్లాడుతూ అనుకున్నట్టే కక్ష్యలో జీఎస్ఎల్ వీ -డీ5 విజయవంతంగా అడుగుపెట్టిందని ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ తెలిపారు.

ఇందుకు కష్టపడిన ప్రతి ఒక్కరూ అభినందనీయులని శాస్త్రవేత్తలను అభినందించారు. ప్రముఖ శాస్త్రవేత్త యూఆర్ రావు 1992లో రూపొందించిన క్రయోజనిక్ ఇంజిన్ తమ అంచనాలకు అనుగుణంగా పని చేసిందని అన్నారు. ఈ విజయం ఇస్రో సభ్యులందరిదీ అని, దేశ శాస్త్రీయ సమాజానికి ఇది సుదినం అని ఆయన అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News