: జనవరి 10 నుంచి ఆప్ సభ్యత్వ నమోదు
రానున్న సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా పోటీ చేసేందుకు ఆప్ రంగం సిద్ధం చేస్తోంది. దీంతో జనవరి 10 నుంచి 26 వరకు ఆప్ సభ్యత్వ కార్యక్రమం నిర్వహించనుంది. దేశవ్యాప్తంగా ఎవరైనా సరే దరఖాస్తు పూర్తి చేసి జిల్లా స్థాయిలో అప్పగిస్తే అవి పరిశీలించి జాతీయ స్థాయికి పంపించడం జరుగుతుందని ఆప్ నేత యోగేంద్ర యాదవ్ ఢిల్లీలో తెలిపారు. ఈ కార్యక్రమానికి 'మై భీ ఆమ్ ఆద్మీ' పేరును ఖరారు చేశారు.