: అవినీతి అంటని వ్యవసాయాన్ని అవినీతిమయం చేయకండి: రేవంత్ రెడ్డి


కేసీఆర్ కారణంగా 'ఉత్తమ అవినీతి రైతు' అనే అవార్డు ఇచ్చే అవకాశం ఉందని టీడీపీ నేత రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ ఉత్తమ రైతు అవార్డులిచ్చి రైతుల్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, వారెవరూ కోట్ల రూపాయలు సంపాదించలేదని అన్నారు. ఉత్తమ రైతు అనే వాడు...వ్యవసాయ పద్ధతుల గురించి మాట్లాడుతాడు. వ్యవసాయానికి అయ్యే పెట్టుబడి, శ్రమ గురించి వివరిస్తాడు కానీ, కోట్ల రూపాయలు లాభం వచ్చిందని చెప్పడం తానెప్పుడూ వినలేదని అన్నారు.

ఉద్యమం పేరుతో దందాలు చేసి సంపాదించిన నల్ల డబ్బును తెల్లధనం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆయన మండిపడ్డారు. 'అవినీతి అంటని వ్యవసాయానికి మీ అవినీతి అంటించకండి' అని ఆయన విజ్ఞప్తి చేశారు.

  • Loading...

More Telugu News