: సీమ గడ్డ మీద పుట్టారు.. కిరణ్, బాబు... మీకు సిగ్గుందా?: జగన్
'రాయలసీమ గడ్డమీద పుట్టిన కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు... మీరు విభజనకు సహకరిస్తున్నారు మీకు సిగ్గుందా?' అని వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ ప్రశ్నించారు. చిత్తూరు జిల్లా బి కొత్తకోట మండలంలో మూడో విడత సమైక్యశంఖారావ యాత్ర ప్రారంభించిన జగన్ మాట్లాడుతూ, సోనియా గీసిన గీతను దాటకుండా ఒకరు నాటకాలాడుతుంటే, మరొకరు కుమ్మక్కు రాజకీయాలతో కనీసం సమైక్యమనే మాట చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదని మండిపడ్డారు.
రాహుల్ ను ప్రధానిని చేసేందుకు కుట్రపన్ని రాష్ట్రాన్ని ముక్కలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ గుండెలదిరేలా సమైక్యనినాదం వినిపించాలని జగన్ పిలుపునిచ్చారు. రాష్ట్రం కలిసి ఉన్నప్పుడే నదీజలాలు సరిపోవడం లేదని, ఇక విభజిస్తే ఎలా సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. 'నాలుగు నెలలు ఓపిక పట్టండి. అన్ని ప్రాంతాల సమస్యలు తీరుస్తా'నని జగన్ హామీ ఇచ్చారు.