: జనవరిలో టెట్, ఫిబ్రవరిలో డీఎస్సీ: పార్థసారధి
జనవరిలో టెట్, ఫిబ్రవరిలో డీఎస్సీ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని విద్యాశాఖా మంత్రి పార్థసారధి తెలిపారు. విజయవాడలో రాష్ట్రస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను బిషప్ గ్రాసీ ఉన్నత పాఠశాలలో ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు వైజ్ఞానిక ప్రదర్శనల్లో పాలు పంచుకోవడం వల్ల వారి మెదడు చురుకుగా ఉంటుందని అన్నారు. ఇలాంటి ప్రదర్శనలు విద్యార్థుల్లో ఆసక్తిని పెంచుతాయని ఆయన అభిప్రాయపడ్డారు.