: విభజన ఇష్టం లేదు... అయితే, అధిష్ఠానం నిర్ణయమే అంతిమం: డొక్కా
రాష్ట్ర విభజన తనకు ఇష్టం లేకపోయినా క్రమశిక్షణ గల పార్టీ వాదిగా అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి, అచ్చంపేట నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉపాధిహామీ కూలీల డబ్బులు సక్రమంగా పంపిణీ అయ్యేలా చర్యలు తీసుకుంటామన్నారు.