: నీలి చిత్రాల కేసులు దక్షిణాదినే ఎక్కువట


నీలి చిత్రాలకు సంబంధించిన కేసులు దక్షిణాది రాష్ట్రాల్లోనే ఎక్కువగా నమోదవుతున్నాయి. కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం... 2010 నుంచి 2012 వరకు దేశంలోనే కేరళలో అత్యధికంగా 386 కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 199, కర్ణాటకలో 114 కేసులు నమోదు కావడం విశేషం. కర్ణాటక విధాన సభలో ఎమ్మెల్యేలే బూతు చిత్రాలు చూడడం.. ఆ సీన్లు మీడియాలో రావడం తెలిసిందే. కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ఈ నాలుగు దక్షిణాది రాష్ట్రాలలో మూడేళ్ల కాలంలో 609 పోర్నోగ్రఫీ కేసులు దాఖలయ్యాయి. అదే సమయంలో దేశవ్యాప్తంగా 1,413 కేసులు నమోదు కావడం విశేషం.

  • Loading...

More Telugu News