: అన్నీ గడ్డకట్టుకుపోయాయి.. కరెంటు, నీరు లేవు
కరెంటు లేదు.. నీరు లేదు.. ఉన్న సెలయేరు గడ్డకట్టుకుపోయింది. రోడ్లు మూసుకుపోయాయి. ఇదీ... జమ్మూకాశ్మీర్ లోని కుల్గావ్ గ్రామం పరిస్థితి. మైనస్ పది డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతతో పెద్దఎత్తున మంచువాన కురుస్తుండడంతో రోజు గడవడం దుర్భరంగా మారింది. చిన్న చిన్న ఇళ్లలో అతి కష్టం మీద కాలం వెళ్లదీస్తున్న గ్రామస్థులు ఈ ఏడాది చలికాలం మరీ తీవ్రంగా ఉందని వాపోతున్నారు. తమకు పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని గ్రామస్థులు ఎన్నిసార్లు ప్రభుత్వానికి అర్జీలు పెట్టుకున్నా ఉపయోగం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చలి జూలు విదిల్చడంతో పిల్లలు, వృద్ధులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు.