: పులులు, సింహాలు, రెడ్ పాండాలను మింగేస్తున్న డాగ్ వైరస్


డాగ్ వైరస్.. అరుదైన జంతువులైన పులులు, రెడ్ పాండాలు, సింహాలను బలి తీసుకుంటోంది. కేన్నీ డిస్టెంపర్ వైరస్(సీడీవీ) బారిన పడి ఇవి ప్రాణాలు విడుస్తున్నాయి. సాధారణంగా ఈ వైరస్ శునకాల్లో ఉంటుంది. చనిపోతున్న పులులు, సింహాల రక్త నమూనాలను ఉత్తరప్రదేశ్ లోని బరేలీలో ఉన్న పశుపరిశోధన కేంద్రంలో పరీక్షించగా.. ఈ వైరస్ బయటపడింది. గత ఏడాదిగా మృత్యువాత పడిన పులులు, రెడ్ పాండాలు, సింహాలలో సీడీవీని గుర్తించామని వైద్యులు తెలిపారు. పాట్నాలోని దుద్వా పులులు అభయారణ్యంలో, పశ్చిమబెంగాల్లోని చాలా జంతు ప్రదర్శన శాలల్లో ఈ వైరస్ ఉన్నట్లు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News