: అది ప్రేమ లేఖా?.. ఏమి అహంకారము!: వీహెచ్
మంత్రి శ్రీధర్ బాబు లేఖను ప్రేమలేఖగా సంబోధించిన ముఖ్యమంత్రిది 'అహంకారపూరిత ఫ్యాక్షనిజం ధోరణి' అని కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ మండిపడ్డారు. ఇందిర విజయ రథయాత్ర మూడో రోజు సందర్భంగా మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన మాట్లాడుతూ, అవినీతి గురించి మాట్లాడుతున్న సీఎం పదవి నుంచి దిగిపోతే అతని నీతెంతో తెలుస్తుందని ఆయన ఎద్దేవా చేశారు. అతని సొంత జిల్లా నుంచే మూడేళ్లలో కోట్ల రూపాయల విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్ జరిగిందని వీహెచ్ గుర్తు చేశారు. శ్రీధర్ బాబుకు జరిగిన అవమానం తెలంగాణ ప్రజలందరికీ జరిగిన అవమానంగా భావిస్తున్నామని వీహెచ్ తెలిపారు.