: కాంగ్రెస్ కి శాశ్వత రిటైర్మెంట్ ప్రకటించాలి: వెంకయ్యనాయుడు
కాంగ్రెస్ పార్టీకి శాశ్వత రిటైర్మెంట్ ప్రకటించాలని దేశప్రజలు కోరుకుంటున్నారని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ దేశాన్ని కాంగ్రెస్ నాయకత్వం నాశనం దిశగా నడిపించిందని మండిపడ్డారు. ద్రవ్యోల్బణం , ధరలు గతంలో ఎన్నడూ లేనంతగా పెరిగిపోయాయని అన్నారు. దేశ ప్రధానిగా మన్మోహన్ సింగ్ క్రియాశీలకంగా వ్యవహరించలేకపోయారని ఆయన విమర్శించారు. అవినీతి కూటమికి మన్మోహన్ సింగ్ నాయకత్వం వహించారని అన్నారు. గాంధీ కుటుంబం పట్ల విధేయత ప్రకటించుకునేందుకే ప్రధాని మీడియా సమావేశం పెట్టారని ఆయన మాటల ద్వారా అర్ధమైందని వెంకయ్య తెలిపారు.