: ఏపీఎన్జీవోల ఎన్నికల పోలింగ్ షురూ
ఏపీఎన్జీవోల రాష్ట్ర కార్యవర్గ ఎన్నికల పోలింగ్ ఉదయం 9 గంటలకు ప్రారంభమైంది. సమైక్య ఉద్యమంలో ఉద్యోగులకు నాయకత్వం వహించిన అశోక్ బాబు ప్యానెల్ తో ఒంగోలు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న షేక్ బషీర్ ప్యానెల్ తలపడుతోంది. 847 ఓట్లు కలిగిన ఏపీఎన్జీవోల సంఘం ఒక్కో ప్యానెల్ లో 17 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 3 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. రాత్రి 8 గంటలకు ఫలితాలు వెలువడనున్నాయి. గెలుపుపై అశోక్ బాబు ధీమా వ్యక్తం చేస్తుండగా, అశోక్ బాబుపై ఉన్న వ్యతిరేకతే తమను గెలిపిస్తుందని బషీర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.