: శృతి హాసన్ కు న్యూ ఇయర్ నిన్ననే స్టార్ట్
అదేంటీ, 2014 ప్రారంభమై నాలుగు రోజులైపోయింది కదా? అన్న సందేహం వచ్చేసి ఉంటుంది. నిజమే, ప్రపంచమంతటికీ నాలుగు రోజుల క్రితమే నూతన ఏడాది మొదలైంది. కానీ, బహుభాషా నటి శృతి హాసన్ కు మాత్రం నిన్ననే కొత్త ఏడాది మొదలైందట. దీనికి కారణం జనవరి 1న శృతి అనారోగ్యం పాలైంది. 'అనారోగ్యం కారణంగా నూతన సంవత్సరం మంచిగా ప్రారంభం కాలేదు. కనుక, నాకు జనవరి 4నే కొత్త ఏడాది మొదలైంది' అంటూ శృతి హాసన్ ట్విట్టర్లో రాసింది. మరి లేట్ గా మొదలైనా.. మిగతా నటీమణులను దాటుకుని వేగంగా విజయాలవైపు ఈ ఏడాదిలో దూసుకుపోతుందేమో చూడాలి.