: మహిళా ప్రపంచకప్పులో భారత జట్టు లక్ష్యం 283


మహిళా ప్రపంచ కప్ లో భాగంగా ఇవాళ భారత్ -శ్రీలంక జట్ల మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో ఐదు వికెట్లు నష్టపోయి 282 పరుగుల భారీ స్కోరు చేసింది. 

శ్రీలంక ఓపెనర్ యశోదా మెండిస్(55) , మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ ఉమెన్ రసంగిక(84), సిరివర్థనే(59) జట్టు భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించారు. చివర్లో కౌసల్య (31 బంతుల్లో 56 పరుగులు) చెలరేగడంతో లంక  భారీ స్కోరు చేసింది. దీంతో భారత్ బ్యాట్స్ ఉమెన్ మరోసారి భారీ లక్ష్యంతో బరిలోకి దిగనున్నారు. 

భారత బౌలర్లలో జులన్ గోస్వామి మూడు వికెట్లు పడగొట్టగా, అమితా శర్మ ఒక వికెట్ పడగొట్టింది.

  • Loading...

More Telugu News