: ఈ గీతం వింటే.. మీ ఓటు మోడీకే!
తమిళనాట మోడీకి అభిమానులు పెరిగిపోతున్నారు. దీనికి నిదర్శనం అక్కడ మోడీ కోసం ప్రత్యేక సంఘాలు ఏర్పడుతున్నాయి. నరేంద్ర మోడీ అభిమానుల సమాఖ్య ఏకంగా ఒక ప్రత్యేక గీతాన్ని రూపొందించింది. ఇందులో మోడీ విజయగాథను వివరించారు. ఈ గీతాన్ని వింటే మోడీ గురించి పూర్తిగా తెలుస్తుందని.. విన్నవారు తమ ఓటు మోడీకే వేస్తారని నమో సమాఖ్య వ్యవస్థాపకుడు వినోద్ మీడియాకు తెలిపారు. ఈ రోజు కోయంబత్తూరులో బీజేపీ నేతల సమక్షంలో దీన్ని విడుదల చేస్తామని చెప్పారు. ఈ గీతాన్ని రింగ్ టోన్ గా కూడా వాడుకోవచ్చట.