: దేవాలయానికి కాళ్లొచ్చాయ్!
దేవాలయానికి కాళ్లు రావడం ఏంటీ? అన్న సందేహం వదిలేయండి. నిజమే మరి, తమిళనాడులోని వేలూరు జిల్లా అయ్యనూరు గ్రామంలో గంగమ్మతల్లి ఆలయం 40 అడుగులు వెనక్కి వెళుతోంది. ఈ చిత్రాన్ని చూసి స్థానికులు సంభ్రమాశ్చర్యాలకు లోనవుతున్నారు. చెన్నై, బెంగళూరు జాతీయ రహదారి విస్తరణలో భాగంగా అడ్డొచ్చిన ఆలయాన్ని అధికారులు ఇలా వెనక్కి జరిపేందుకు నిర్ణయించారు. ఇందుకు స్థానికులు కూడా అంగీకరించడంతో హర్యానాకు చెందిన ఇంజనీరింగ్ సంస్థ రంగంలోకి దిగింది. దేవాలయాన్ని పునాదులు సహా జాకీలతో లేపి కొద్ది కొద్దిగా వెనక్కి జరుపుతున్నారు. నాలుగు రోజుల్లో పనిపూర్తి చేస్తారు.