: ట్రాక్ పైకి దూసుకెళ్లిన లారీ
మీరు సరిగ్గానే చదివారు రైల్వే ట్రాక్ పైకి లారీ దూసుకుపోయింది. ఫ్లాట్ ఫాంపైకి దూసుకొచ్చే రైళ్ల సంప్రదాయాన్ని పుణికిపుచ్చుకున్న లారీ నల్గొండజిల్లా యాదగిరిగుట్ట మండలం రామాజీపేటలో అదుపుతప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న రైల్వే ట్రాక్ మీదికి దూసుకుపోయి బోల్తాపడింది. దీంతో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.