: పాక్ పై గెలిచిన అండర్ 19 టీమిండియా
షార్జాలో జరుగుతున్న అండర్ 19 ఆసియా కప్ క్రికెట్ టోర్నీలో భారత జట్టు జయకేతనం ఎగురవేసింది. టైటిల్ పోరులో భాగంగా జరిగిన ఫైనల్స్ లో భారత్ చిరకాల ప్రత్యర్థి పాక్ పై 40 పరుగుల తేడాతో తిరుగులేని విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టులో కేరళ తాజా యువసంచలనం సంజు శాంసన్, విజయ్ జోల్ లు శతకాలతో అదరగొట్టడంతో టీమిండియా ఎనిమిది వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ 9 వికెట్ల నష్టానికి 274పరుగులే చేసి ఓటమిపాలైంది.