: సంక్రాంతి స్పెషల్... సికింద్రాబాదు-గూడూరు ఏసీ సూపర్ ఫాస్ట్ రైళ్లు


సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టిన విషయం విదితమే. తాజాగా సికింద్రాబాదు-గూడూరు మార్గంలో ఏసీ సూపర్ ఫాస్ట్ రైళ్లను ఏర్పాటు చేసింది. ఈ ప్రత్యేక రైళ్లలో ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవచ్చునని.. ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని రైల్వే సీపీఆర్వో పేర్కొన్నారు. ఈ నెల 11వ తేదీన ఉదయం 11 గంటలకు సికింద్రాబాదు నుంచి ఏసీ సూపర్ ఫాస్ట్ స్పెషల్ బయల్దేరుతుందని ఆయన చెప్పారు. అలాగే, 12వ తేదీన రాత్రి 12.40 గంటలకు గూడూరు నుంచి ప్రత్యేక రైలు బయల్దేరి మరునాడు సికింద్రాబాదు స్టేషనుకు చేరుతుందని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News