: గుత్తా జ్వాల-బ్యాడ్మింటన్ సంఘం మధ్య ముగిసిన వివాదం
డబుల్స్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల, బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బాయ్)ల మధ్య కొన్ని నెలల క్రితం ఏర్పడ్డ అంతరానికి తెరపడింది. ఐబీఎల్ లో తన టీమ్ పై వివాదం నేపథ్యంలో జ్వాలపై చర్యలు తీసుకుని జీవితకాల నిషేధం విధించాలనుకున్న 'బాయ్' ఆ నిర్ణయాన్ని వెనక్కుతీసుకుంది. ఈ మేరకు ఈ నెల 7వ తేదీ నుంచి జరగనున్న కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ కు జ్వాలను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై స్పందించిన జ్వాల.. బాయ్ తీసుకున్న నిర్ణయంతో తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపింది. దానివల్ల భవిష్యత్ లో భారత్ జట్టు తరపున తాను ఆడతానని, దేశం తరపున ఆడడం ఎప్పుడూ తనకు గౌరవంగా ఉంటుందని పేర్కొంది.