: వేట కుక్కలతో మేనమామను చంపించిన నియంత
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ తన మేనమామ జంగ్ సాంగ్ థీక్(67)కు భయంకరమైన మరణశిక్ష అమలు చేశాడు. థీక్ కు రాజద్రోహం నేరంపై మరణశిక్ష విధించిన ఉన్... డిసెంబర్ 12న థీక్, అతని ఐదుగురు అనుచరులను నగ్నంగా బోనులో బంధించి 120 వేట కుక్కలను వదిలేశాడు. అవి సుమారు గంటన్నరపాటు వారిని మీదపడి పీక్కు తిన్నాయని వెన్ వెయ్ పో అనే చైనా పత్రిక వెల్లడించింది. ఈ శిక్షను అక్కడ క్వాన్ జ్యు (వేట కుక్కలతో అమలు చేసే శిక్ష) అని పిలుస్తారు.