: బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు
బంగ్లాదేశ్ లో జమాతే ఇస్లామీ నాయకుడికి మరణ శిక్ష విధించిన నేపథ్యంలో చెలరేగిన అలర్లు విస్తరించాయి. తాజాగా బంగ్లాలో ఇస్లామిక్ అతివాదులు హిందువులపైనా ప్రతీకార దాడులకు దిగుతున్నారు. సిరాజ్ గంజ్, నౌఖాలి, సాత్కీరా ప్రాంతాల్లో హిందువుల ఆవాసాలపై దాడులు జరిగాయి.
దేశవ్యాప్తంగా 47 దేవాలయాలు, 700 నివాసాలపై జమాతే ఇస్లామీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. అయితే, ప్రతిపక్ష నేషన్ పార్టీకి మిత్రపక్షమైన జమాతే ఇస్లామీ తాజా దాడులు తమ పనికాదని అంటోంది. అధికార అవామీ లీగ్ కార్యకర్తలే ఈ హింసకు కారణమని ఆరోపిస్తోంది.