: ఆ మాత్రం దానికి ప్రెస్ మీట్ అవసరమా?: బీహార్ సీఎం నితీష్ కుమార్
ప్రధాని మన్మోహన్ సింగ్ నిన్న మీడియా సమావేశంలో మాట్లాడిన దానిలో కొత్తగా చెప్పుకోవాల్సింది ఏమీ లేదని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అన్నారు. తనకు ఇదే చివరి సమావేశం అన్నట్టుగా ప్రధాని మాట్లాడారని ఎద్దేవా చేశారు. దేశ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు తీసుకోబోయే చర్యలను కానీ, దేశ ఉన్నతి కోసం చేపట్టబోయే పథకాల గురించి కానీ మన్మోహన్ మాట్లాడలేదని విమర్శించారు. ఈ మాత్రం దానికి ఆయన ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. అయితే, ప్రధాని పదవికి రాహుల్ గాంధీ అర్హుడు అన్న ప్రధాని వ్యాఖ్యలపై నితీష్ కుమార్ కామెంట్ చేయలేదు.