: మాట మార్చిన కేసీఆర్: మధుయాష్కీ
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తే బేషరతుగా తెలంగాణ రాష్ట్ర సమితిని విలీనం చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్.. ఇప్పడు మాట మార్చారంటూ ఎంపీ మధుయాష్కీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన హైదరాబాదులో మీడియాతో మాట్లాడారు. పార్టీ విలీనం విషయమై ఇప్పటికైనా కేసీఆర్ పెదవి విప్పాలని.. ప్రజలకు సమాధానం చెప్పి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిందని కేసీఆర్ సంబరపడుతున్నారని.. అయితే తాము కోరుకున్నది సామాజిక తెలంగాణ అని మధుయాష్కీ స్పష్టం చేశారు.