: సీమాంధ్ర ఎంపీలను అడ్డుకున్న పోలీసులు
రెండు రోజుల పాటు హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద సంకల్ప దీక్ష చేపట్టిన సీమాంధ్ర ఎంపీలు దీక్షను విరమించారు. అనంతరం ఎంపీలు సబ్బం హరి, లగడపాటి, హర్షకుమార్ దీక్షా శిబిరం నుంచి ట్యాంక్ బండ్ మీదున్న తెలుగుతల్లి విగ్రహం వరకు ర్యాలీగా బయల్దేరారు. అయితే వీరి ర్యాలీని ఇందిరా పార్క్ వద్దే పోలీసులు అడ్డుకున్నారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు.