: ప్రత్యేక సమావేశాలను అడ్డుకుంటాం: సబ్బం హరి
తెలంగాణ బిల్లు కోసం పార్లమెంటులో ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలన్న ఆలోచన ఉంటే... దానిని తాము అడ్డుకుంటామని సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీ సబ్బం హరి తెలిపారు. ఆరు మంది ఎంపీలం లోక్ సభలో అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చినప్పుడు అందరూ నవ్వుకున్నారని.... కానీ, రెండుమూడు రోజుల్లోనే 75 మంది ఎంపీల మద్దతు కూడగట్టామని గుర్తుచేశారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవడానికి ఏం చేయడానికైనా తాము సిద్ధమని చెప్పారు. హైదరాబాదులో సంకల్ప దీక్షను విరమించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.