: టోల్ ప్లాజా సిబ్బందిపై ఎస్పీ కార్యకర్తల దాడి
ఉత్తరప్రదేశ్ లోని లక్నో-ఫైజాబాద్ జాతీయ రహదారిపై ఉన్న టోల్ ప్లాజా సిబ్బందిపై సమాజ్ వాదీ పార్టీ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. రహదారిని ఉపయోగించుకున్నందుకు గానూ కొంత రుసుము కట్టాలని ప్లాజా సిబ్బంది అడగ్గా, కార్యకర్తలు ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. ఈ దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డవడంతో విషయం బయటపడింది. సిబ్బందికి తీవ్ర గాయాలవడంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నట్లు తెలుస్తోంది.