: బిల్లుపై కూలంకుషంగా చర్చించాలి: లగడపాటి
రాష్ట్ర విభజన బిల్లులోని ప్రతి అంశంపై అసెంబ్లీలో కూలంకుషంగా చర్చ జరగాలని విజయవాడ ఎంపీ లగడపాటి అన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు సుదీర్ఘ చర్చలు జరిపి, సమస్యలను ప్రస్తావించాలని కోరారు. దీనివల్ల రాష్ట్ర విభజనతో సీమాంధ్ర ప్రాంతం ఏ విధంగా నష్టపోతుందనే విషయం అందరికీ అర్థమవుతుందని తెలిపారు. హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద సీమాంధ్ర కాంగ్రెస్ ఎంపీలు చేపట్టిన సంకల్ప దీక్ష విరమించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వచ్చే ఎన్నికలు సమైక్యాంధ్రలో జరిగితే... తెలంగాణ కోరుకునే పార్టీలు దుకాణం మూసేసుకుంటాయా? అంటూ సవాల్ విసిరారు.